National rural employment guarantee news: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు నిధులిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేసేది. ఏటా వేసవిలో సమ్మర్ అలవెన్స్ కింద సర్కార్ అదనంగా 20 శాతం భత్యం చెల్లించేది.
కేంద్రమే నేరుగా చేస్తుండడంతో...
MGNREGA NEWS: ఇటీవలే ఉపాధి హామీ పథకంలో చెల్లింపుల ప్రక్రియను కేంద్రమే తీసుకుంది. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 15 నుంచి 20 శాతం వేసవి భత్యంగా అందించేది. సుమారు ఈ అయిదు నెలల పాటు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఫిబ్రవరిలో 15 శాతం, మార్చి నుంచి మే వరకు 20 శాతం, మరల జూన్‌లో 15 శాతం అదనంగా సమ్మర్ అలవెన్స్ చెల్లించేవారు. ఏడు గంటలు పని చేసిన వారికి రూ. 217 కూలీ వచ్చేది. వేసవిలో పూర్తిస్థాయిలో పనిచేసిన వారికి రూ. 290 వరకు అందేది. కానీ ఈ సారి చెల్లింపును కేంద్రమే నేరుగా చేస్తుండడంతో వేసవి భత్యం పరిగణించడం లేదు.
కూలీలకు వెళ్తున్న లక్షలాది మందిపై...
రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 27 లక్షల మంది కూలీలు వ్యవసాయ పనులకు వెళుతున్నారు. 12,769 గ్రామ పంచాయతీల్లో ఉపాధి కూలీ పనులు జరుగుతుంటాయి. ఈ సీజన్‌లో రోజూ కనీస పనులు లేని సమయంలో రాష్ట్రంలో అత్యధికంగా 27 లక్షలకు పైగా కూలీలు ఉపాధి పనులకు వెళ్లి కూలీ అందుకుంటారు. కేంద్రం అందించే భత్యం కోత విధించడంతో ఈ ప్రభావం కూలీలకు వెళ్తున్న లక్షలాది మందిపై పడుతుంది.
ఇదీ చదవండి:Sanitation in Schools: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలదే..