వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్థులంతా కలిసి అతనికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనా బారినపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడం వల్ల చనిపోయాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ స్వగ్రామం మైలారానికి తీసుకొచ్చారు. అనంతరం గ్రామస్థులంతా కలిసి ఆ కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు... ఆ గ్రామ సర్పంచ్, గ్రామస్థులను అభినందించారు.
ఇదీ చూడండి: ప్రజల కోసం కాంగ్రెస్ నేతలు ఉద్యమించాలి: సోనియా