వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో ఆరోగ్యశ్రీలో లేని వివిధ రకాల వ్యాధుల వైద్య పరీక్షలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెక్కుల రూపంలో అందించారు. 139 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొత్తం 47 లక్షలు అందజేసినట్లు తెలిపారు. ఒక్క వర్ధన్నపేటలోనే 7 లక్షల 30 వేల రూపాయలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రశంసించారు.
ఇదీ చూడండి : పరకాల ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన జేసీ