ముక్కోటి ఏకాదశి సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ తెల్లవారుజామున నుంచే ఆలయానికి బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి వారిని ఉత్తర ముఖద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. హన్మకొండలోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఉత్తర ద్వారం గుండా వెళుతూ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. వేకువజాము నుంచే భారీగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా సందర్భంగా మాస్క్ ఉంటేనే లోపలికి అనుమతించారు.
ఇవీచూడండి: వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?