Temperature Drops Telangana : రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రోజులుగా తీవ్రమైన చలిపంజా నుంచి రక్షణ పొందేందుకు జనం స్వెటర్లు , రగ్గులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఉన్ని దుస్తులకు మార్కెట్‌లో గిరాకీ బాగా పెరిగింది.
Low Temperatures in Telangana : చలి పులి వణికిస్తోంది. వారం నుంచి రాత్రిపూట తగ్గిన ఉష్ణోగ్రతలతో జనం గజగజలాడుతున్నారు. మెదక్, అదిలాబాద్‌లో 12 నుంచి 13 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతుండగా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పడిపోయాయి. చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉపశమనం పొందేందుకు ఉన్ని వస్త్రాలు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. హనుమకొండ ఉలెన్ మార్కెట్‌లోని దుకాణాలు కొనుగోలుదార్లతో కిటకిటలాడుతున్నాయి.
sweaters selling : చలి పెరుగడంతో స్వెటర్లకు గిరాకీ పెరిగింది. నేపాలీలు నిర్వహించే దుకాణాల్లో ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండే వస్తువులు దొరుకుతున్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇక్కడ అన్ని వయస్సుల వారికి అనుగుణంగా స్వెటర్లు, జర్కిన్‌లు, మంకీటోపీలు అందుబాటులో ఉన్నాయి. దుకాణాల్లో కన్నా తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారులు ఎక్కువగా నేపాలీలు అమ్ముతున్న ఉన్ని వస్త్రాలు కొంటున్నారు.
ఓ వైపు చలి.. మరో వైపు పొగమంచు.. జర జాగ్రత్త సుమా..!
"మేం నేపాల్ నుంచి తయారుచేసిన ఉన్ని వస్త్రాలు అమ్ముతాము. చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు ఇక్కడ అన్ని రకాలు ఉన్ని వస్త్రాలు దొరుకుతాయి. బయట షాప్‌లో కంటే మా దగ్గర తక్కువ రేట్లు ఉంటాయి. నాణ్యత ఉంటుంది. చలి బాగా పెరగినందున గిరాకీ బాగుంది. రోజుకు రూ.10,000 వరకు గిరాకీ అవుతోంది.'' - షాప్ యజమాని
Winter Effect : షాపింగ్ మాల్స్ కంటే నేపాలీలు నిర్వహించే దుకాణాల్లో ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండే వస్తువులు దొరుకుతున్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. చలి బాగా పెరగినందున గిరాకీ బాగుందని దుకాణదారులు చెబుతున్నారు. చలి పెరిగిన కారణంగా రాత్రిపూట రహదారులపై జనసంచారం బాగా తగ్గింది. రహదారులపై ట్రాఫిక్ సైతం నామమాత్రంగా ఉంటోంది.
మళ్లీ చలిపులి పంజా.. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత్తలు
" వారం నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పిల్లలు బడికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. చలి నుంచి తట్టుకునేందుకు ఉన్ని వస్త్రాలు కొనేందుకు మార్కట్‌కు వచ్చాము. ఇక్కడ నేపాలీ వారు పెట్టిన దుకాణల్లో నాణ్యతమైన స్వెటర్లు దొరుకుతున్నాయి. అన్ని షాపుల కంటే ఇక్కడ తక్కువ ధరలు ఉన్నాయి." - స్థానికులు
రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదు అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, నగర పరిసర శివారు ప్రాంతాల్లో 12 డిగ్రీల నుంచి 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి.
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు - పగటి పూటే వణుకుతున్న ప్రజలు