వరంగల్ గ్రామీణ జిల్లాలోని రైతు వేదిక నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న రైతు వేదిక పనులపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు.
దసరా నాటికి నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి నాణ్యత ప్రమాణాలతో రైతు వేదిక నిర్మాణం జరగాలని.. అందుకు కావలసిన జాగ్రత్తలపై ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.
ఇదీ చూడండి: దేశానికే దిక్సూచీలుగా రైతువేదికలు: ఎమ్మెల్యే