ETV Bharat / state

వరంగల్ జిల్లాలో సీనియర్​ విద్యార్థి వేధింపులతో మరొకరు మృతి - Student suicide in Narsampet

Student suicide in Narsampet: వరంగల్​ జిల్లా నర్సంపేటలో సీనియర్​ విద్యార్థి వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకొంది. తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని బంధువుల ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

student commits suicide by hanging
student commits suicide by hanging
author img

By

Published : Feb 26, 2023, 10:16 PM IST

Updated : Feb 26, 2023, 10:58 PM IST

Student suicide in Narsampet : సీనియర్​ విద్యార్థి వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తె రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతుంది.

ఈ క్రమంలో ఓ విద్యార్థి మరో విద్యార్థితో కలిసి ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో మనస్థాపానికి గురై వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. గత రెండు రోజుల నుంచి రక్షిత కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు అదేరోజు భూపాలపల్లిలో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు.

మరోవైపు వరంగల్​ జిల్లాలో సీనియర్ వేధింపులకు మనస్తాపంతో విషపూరిత ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి మృత్యవుతో పోరాడి ఇవాళ మృతి చెందింది. నిమ్స్​లో చికిత్స పొందుతున్న ప్రీతి రాత్రి 9.10 గంటలకు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రీతి మృతి పట్ల ప్రభుత్వ పెద్దలు, విపక్ష సభ్యులు సంతాపం తెలిపారు.

ఆమె మరణ వార్తను తెలిసిన పలు విద్యార్థి సంఘాలు, కుటంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి వచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతి దేహాన్ని తీసుకువెళ్లడానికి వీలుకాదని భైఠాయించారు. న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. ప్రీతిని మరి కాసేపట్లో గాంధీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో వరుసుగా నెలకొంటున్న విద్యార్థినుల ఆత్మహత్యలు మరింత కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.

ఇవీ చదవండి:

నిమ్స్​లో చికిత్స పొందుతూ వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

మరో 'ట్రయాంగిల్ లవ్' హత్య.. ప్రేయసి కోసం స్నేహితుడిని దారుణంగా పొడిచి..

వైద్య విద్యార్థి ఆత్మహత్య.. అసలు కారణమిదే!

'నా కొడుకు చేసింది తప్పే.. కానీ నవీన్​ హత్య ఒక్కడి వల్ల సాధ్యం కాదు'

Last Updated : Feb 26, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.