వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని విత్తనాలు, ఎరువుల దుకాణా డీలర్లతో ఎస్సై సమావేశమయ్యారు. ఖరీఫ్ కాలంలో రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీ డీలర్ నుంచి మాత్రమే సరకులు తీసుకోవాలని సూచించారు.
రైతులు కొన్న సరకులకు తప్పనిసరిగా రసీదులు పొందాలని పోలీసులు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినట్లు సమాచారం అందితే.. ఆ దుకాణాదారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు