వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు పట్టణంలోని వరంగల్ రోడ్డులో చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో డ్రైవర్ కండక్టర్‌తోపాటు మరో ఆరుగురు ప్రయాణికులున్నారు. అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాత్కాలిక డ్రైవర్ బస్సును నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : 'ప్రభాకర్‌రావుపై అసత్య ఆరోపణలు తగవు'