ETV Bharat / state

మొదలైన వరి కోతలు.. ఇబ్బందులు పడుతున్న రైతులు

వరంగల్ గ్రామీణ జిల్లాలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి.. ఈ యాసంగి పంటకు నీరు సమృద్ధిగా ఉన్నా.. వరి కోతలకు పలు మండలాల్లో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వరి కోతకు అవసరమయ్యే హార్వెస్టర్లు సరిపడా లేకపోవడం, లాక్​డౌన్ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి రాకపోవడం జరగుతోంది. ఆ కారణాలతో రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పంట కోస్తూ ధాన్యాన్ని పోగు చేసుకుంటున్నారు.

Rice crop cuts farmers are in trouble warangal rural areas
మొదలైన వరి కోతలు.. ఇబ్బందులు పడుతున్న రైతులు
author img

By

Published : Apr 17, 2020, 5:24 PM IST

మొదలైన వరి కోతలు.. ఇబ్బందులు పడుతున్న రైతులు

కరోనా కారణంగా వరంగల్ గ్రామీణ జిల్లాలోని పలు మండలాల్లో వరి కోతలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఒకపక్క కూలీలు దొరకని పరిస్థితి ఉండగా, మరో పక్క హార్వెస్టర్ మిషన్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దొ గొప్పో అందుబాటులో ఉన్న హార్వెస్టర్ మిషన్లతో అధిక ధరలతో రైతులు కోయిస్తున్నారు. లాక్​డౌన్ కారణంగా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి, పర్వతగిరి, సంగెం, ఐనవోలు, వర్ధన్నపేట మండలాల్లో వరి కోసేందుకు కూలీలు రావడంలేదు. ధరలు కొంచెం ఎక్కువైనా హార్వెస్టర్ మిషన్ల సాయంతో తమ పంటలను కోసుకుంటున్నారు.

అధికారుల చర్యలేవి..

ఇలాంటి పరిస్థితుల్లో పండించిన ధాన్యంపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కరోనా విపత్తు వల్ల ఈసారి రైతులకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా నీరు ఉన్న చీడపీడలతో కొంత నష్టం జరిగిందని గతంలో కంటే ఈసారి పంట విస్తీర్ణం పెంచినప్పటికీ చీడపీడల కారణంగా లాభాల మాట పక్కన పెడితే నష్టాలే వచ్చే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు.

ఇబ్బందులు తప్పడం లేదు

అందుబాటులో ఉన్న హార్వెస్టర్ మిషన్లతో పంట కోస్తామనుకుంటే ఆ నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. కోత కోసే సమయానికి లాక్​డౌన్ విధించడం వల్ల వాటికి అవసరమైన స్పేర్ పార్ట్స్ కొరత ఏర్పడుతుందంటున్నారు. వాటిని సమకూర్చుకోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుందని హార్వెస్టర్ నిర్వాహకులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ నుంచి సంబంధిత పత్రాలు తీసుకెళ్లిన మార్గమధ్యలో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని హార్వెస్టర్ నిర్వాహకులు తెలిపారు.

ఈసారి యాసంగిలో వరి సాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగైంది. అయితే కరోనా కారణంగా లాక్​డౌన్ అమల్లో ఉన్న తరుణంలో వరి కోతలు హడావిడిగా జరుగుతున్నప్పటికీ రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.

ఇదీ చూడండి : వైద్య కళాశాలలో కరోనా నిర్ధరణ కేంద్రం ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.