ETV Bharat / state

రవళి అంత్యక్రియలు

ప్రేమోన్మాది దాడికి గురై ఆరు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది రవళి. గ్రామస్థులు, కుటుంబసభ్యుల అశ్రునాయనాల మధ్య అంత్యక్రియలు వరంగల్‌ జిల్లా రామచంద్రాపురంలో ముగిశాయి. రాత్రి యశోదా నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించగా ఉదయం బాధిత కుటుంబాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు.

author img

By

Published : Mar 5, 2019, 7:54 PM IST

రవళి అంత్యక్రియలు
రవళి అంత్యక్రియలు
ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన రవళి అంత్యక్రియలు ముగిశాయి. గ్రామస్థులంతా ఆమె అంతిమ యాత్రలో పాల్గొన్నారు. 'అమ్మా వెళ్లిపోతున్నావా'... అంటూకుటుంబసభ్యుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు.

గత నెల 27న ప్రేమోన్మాది సాయి అన్వేష్చేతిలో పెట్రోల్‌ దాడికి గురైన యువతి.. ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడి... గత రాత్రి యశోదా ఆసుపత్రిలో తనువు చాలించింది. ఉదయం గాంధీ ఆసుపత్రిలో శవపరీక్షలు పూర్తి చేసి... ఆమె స్వగ్రామమైన వరంగల్ జిల్లా రామచంద్రాపురానికి మృతదేహాన్ని తరలించారు.

కుటుంబాన్ని ఆదుకుంటాం:

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో మరే ఆడపిల్లకుఇలాంటి అన్యాయం జరగకుండా నిందితుడి​పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కన్నీరు మున్నీరైన గ్రామం:

మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా అందరి ఆవేదన కట్టలు తెచ్చుకుంది. రవళి తల్లిదండ్రులు ఇతర కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో ఊరు ఊరంతా పాల్గొన్నారు. బెయిల్‌ పైన సాయి అన్వేష్ బయటకు వస్తే... ఉద్యమిస్తామని మహిళా సంఘాల నేతలు హెచ్చరించారు.

పోలీసుల బందోబస్తు:
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరు రోజులుగా ఆసుపత్రిలో ఉండి... ఆఖరి క్షణం వరకూ మృత్యువుతో పోరాడినా.....ఫలితం లేకపోయింది. 20 ఏళ్లు కూడా నిండకుండానే నూరేళ్ల జీవితం కాలిపోయింది. ప్రేమోన్మాది కిరాతకానికి సజీవ సాక్ష్యంగా నిలిచి.... ఇక సెలవంటూ శాశ్వతంగా వెళ్లిపోయింది. ఇకముందైనా ఇలాంటి దాడులు జరగకూడదని.... ఉన్మాదుల దాడికి ఏ ఆడబిడ్డా బలి కాకూడదని కోరుకుందాం.

ఇవీ చూడండి: పెళ్లి చేయండి ప్లీజ్

Hyd tg 37 05 illegal construction's demolish ab c18. feed from what's up desk. ప్రభుత్వ స్థలంలో వెలిసిన నిర్మాణాలను కూల్చి వేసిన రెవిన్యూ అధికారులు, హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడా మండలం లోని సర్వే నెంబర్ 266/1 , ఖల్సా విల్లేజ్, ఫరూక్ నగర్ ఏరియా లో 500 గజాల స్థలం లో ఉన్న పదకొండు షాప్ లను రెవిన్యూ అధికారులు ఈ రోజు కూల్చి వేసారు. ఫరూక్ నగర్ లో 500 గజాల స్థలం పై నూరుద్దీన్ ముజాహిద్ మెహ్రాజ్ కబ్జా చేసి 11షాప్లను నిర్మించాడు, బండ్లగూడ మండలం రెవిన్యూ అధికారులు ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం అని తేల్చారు, కానీ మధ్యలో అసంబ్లీ ఎన్నికలు ఉండటం తో మండల అధికారులు బిజీ అయ్యారు , ఈ రోజు హైదరాబాద్ బండ్లగూడ తహసీల్దార్ షేక్ ఫర్హీన్ ఆదేశాలతో డిప్యూటీ తహసిల్దార్ కిషోర్ అద్వర్యం లో ఫలక్ నుమ పోలీసుల సహాయం తో జేసీబీ లు పెట్టి అక్కడ ఉన్న 11 షాప్ లను కూల్చి వేశారు. ప్రభుత్వ భూమి కబ్జా చేయడమే కాకుండా తమ రెవిన్యూ అధికారులకు బెదిరించి,వారి పనులను అడ్డువచ్చినందున ఆ 4గురి పై ఫలక్ నుమ పోలీసులకు డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ ఫిర్యాదు చేశారు. బైట్ డిప్యూటీ mro కిషోర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.