ETV Bharat / state

నిర్మాణం ఆలస్యం... నీరుగారిపోతున్న లక్ష్యం - వరంగల్​ గ్రామీణ జిల్లా వార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదికల నిర్మాణం పనులు వరంగల్ గ్రామీణ జిల్లాలో మందకొడిగా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ నుంచి మొదలు కింది స్థాయి అధికారుల వరకు ఎంతలా చెబుతున్నా పనులు వేగం పుంజుకోవడం లేదు. దసరా నాటికి పూర్తి కావాల్సిన నిర్మాణాలు... నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

నిర్మాణం ఆలస్యం... నీరుగారిపోతున్న లక్ష్యం

author img

By

Published : Nov 6, 2020, 1:33 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదిక నిర్మాణాలు కొన్నిచోట్ల నత్తనకడన సాగుతున్నాయి. దసరా నాటికి పూర్తికావాల్సిన వేదికలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లా వ్యాప్తంగా 74 రైతు వేదికలు మంజూరయ్యాయి. నర్సంపేటలో 29, పరకాలలో 28, వర్ధన్నపేటకు 17 చొప్పున కేటాయించారు. ఐదు నెలల క్రితమే మొదలైన పనులు నేటీకీ కొనసాగుతూనే ఉన్నాయి. నర్సంపేట పరిధిలో కొంత మేర పూర్తయ్యాయి. కానీ... పరకాల, వర్ధన్నపేటలో చాలా వరకు పిల్లర్ల దశలోనే ఉన్నాయి.

అధికారులు చెబుతున్నా...

అధికారుల పర్యటనలు రోజువారీగా జరుగుతున్నా పనులుమాత్రం అంతంతమాత్రానే సాగుతున్నాయి. ఇటీవలే జిల్లా కలెక్టర్ హరిత సంగెo, పర్వతగిరి మండలాల్లో పర్యటించి పనుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ గుత్తేదారుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు.

ఆది నుంచి అడ్డంకులే...

రైతు వేదికల నిర్మాణానికి ఆది నుంచి ఇబ్బందులు చుట్టుముట్టాయి. భవనాల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ పెద్ద తలనొప్పిగా మారింది. చాలా చోట్ల వర్షాల వల్ల పనులు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాల్లో నిర్మాణ కాంట్రాక్టులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు తీసుకున్నారు. అందుచేత అధికారులు గట్టిగా చెప్పలేని పరిస్థితి. వీటితో పాటు నిధుల కొరత నిర్మాణాలకు అడ్డంకిగా మారింది. మరో వైపు త్వరిత గతిన రైతు వేదికలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

త్వరలోనే పూర్తి చేస్తాం...

జిల్లాలో రైతు వేదికల నిర్మాణం ఆలస్యమవుతున్న మాట వాస్తవమే... స్థల సేకరణ, వర్షాల వల్ల పనుల్లో జాప్యం జరిగింది. అధికారులు రోజు వారి పర్యవేక్షణతో పాటు... సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.

-ఉషా దయాళ్, జిల్లా వ్యవసాయ అధికారి

ఇదీ చూడండి: తెలంగాణలో జలాశయాల సామర్థ్యం 878 టీఎంసీలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.