వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండలం నాగారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి రైతు సమన్వయ సమితి (ఆర్ఎస్ఎస్) ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. నాగారం గ్రామ రైతు కో ఆర్డినేటర్ మద్దెల బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
కరోనా విజృంభిస్తున్న కాలంలోనూ రైతులకు ఎకరానికి రూ. 10 వేల పంట సాయం అందిస్తున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు భిక్షపతి అన్నారు. రైతును రాజుగా చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని ఆర్ఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ చింతరెడ్డి సాంబరెడ్డి తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని రైతుల నుంచి ప్రతి గింజ ధాన్యం కొన్న ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకే దక్కుతుందని పరకాల ఏఎంసీ ఛైర్మన్ బొజ్జం రమేశ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- చైనా దాడిని వ్యతిరేకిస్తూ పట్నా వాసుల వినూత్న నిరసన