వరంగల్ గ్రామీణజిల్లా వర్ధన్నపేటలో ఆరడుగుల కొండచిలువ జాలర్లు వేసిన వలకు చిక్కింది. నల్లబెల్లి చెరువు మత్తడి కింద ప్రవహిస్తున్న వాగులో చేపల వేటకు వెళ్లిన వారికి వలలో చేపలకు బదులుగా కొండచిలువ పడగా అవాక్కయ్యారు.
వలను ఒడ్డుకు లాగి ఆరడుగుల కొండచిలువను వెలికి తీసి అటవీ అధికారులకు సమాచారం అందించారు.
ఇదీ చూడండి: కరోనా కోరల్ని లెక్కచేయని తల్లి.. బిడ్డకు పునర్జన్మనిచ్చింది...