రిజర్వేషన్లపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా... వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో దళిత శక్తి ప్రోగ్రాం, స్వేరోస్ ఆధ్వర్యంలో దళిత సంఘాలు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే... అంబేడ్కర్ సెంటర్ ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రగాళ్లకు అరకోటి ఇచ్చిన ధర్మారెడ్డి... విజ్ఞానం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా... పోలీసులు జోక్యం చేసుకొని నిరసనకారులను చెదరగొట్టారు.
ఇదీ చూడండి: 'ఎవరి మనసులైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి'