స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా వరంగల్ గ్రామీణ జిల్లాలో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వర్ధన్నపేట సర్కిల్ పరిధిలో ఈ సోదాలు చేపట్టినట్లు ఏసీపీ రమేష్ వెల్లడించారు.
పలువురు వాహనదారుల వివరాలు సేకరించాకే ప్రయాణానికి అనుమతించినట్లు ఆయన తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. వాహన తనిఖీల్లో సీఐ విశ్వేశ్వర్, ఎస్సై వంశీకృష్ణా సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తమిళనాడులో మరో 5,835 మందికి కరోనా