మావోయిస్టు పార్టీ రేపు తెలంగాణ బంద్కు పిలుపునివ్వటం వల్ల అప్రమత్తమైన పోలీసులు... వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. మావోల కదలికలను కట్టడి చేసేందుకు గానూ... ముందస్తు తనిఖీలు చేస్తున్నారు.
వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలాల్లో వాహనాలను క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాకే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. మావోలను పూర్తి స్థాయిలో కట్టడి చేసే క్రమంలో ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా... సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.