ETV Bharat / state

పోలీసుల పెద్ద మనసు.. గర్భణీని ఇంటికి చేరవేశారు!

లాక్​డౌన్ వేళ విధులు నిర్వహిస్తూనే తమవంతుగా పేదలకు సాయం చేస్తున్నారు పోలీసులు. సొంతూరికి వెళ్లే క్రమంలో పర్వతగిరిలో చిక్కుకుపోయిన ఓ గర్భిణీకి సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. మామునూర్ ఏసీపీ తన వాహనంలో ఆమెను ఇంటికి క్షేమంగా చేర్చారు.

police moved pregnant woman, warangal police
గర్భిణీకి పోలీసుల సాయం, వరంగల్ పోలీసుల దాతృత్వం
author img

By

Published : May 25, 2021, 10:00 AM IST

నిండు గర్భిణీని ఇంటికి చేరవేసి వరంగల్ పోలీసులు పెద్ద మనసు చాటుకున్నారు. మామునూర్ ఏసీపీ నరేష్ కుమార్ తన వాహనంలో ఓ గర్భిణీని ఇంటికి పంపించారు. లాక్​డౌన్​లో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సీఐ పి.కిషన్, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వస్తున్నారు. తొమ్మిది నెలల గర్భిణీ బరిగెల స్వర్ణ, భర్త పేరు అశోక్ హైదరాబాద్ నుంచి సొంతూరు తురకల సోమారానికి వెళ్తుండడాన్ని పోలీసులు గుర్తించారు.

పర్వతగిరిలో బస్సులు, ఆటోలు లేకపోవడంతో దీనంగా నడుస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏసీపీ నరేష్ కుమార్ తన వాహనంలో వారిని ఇంటికి చేరవేసి ఉదారతను చాటుకున్నారు. స్థానికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి: ప్రాంతీయ రింగురోడ్డుకు కరోనా టెండర్‌.. మరో వారం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.