ETV Bharat / state

పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పోలీస్ స్టేషన్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్నారు. ఆ తర్వాతే వాటిని చేతుల్లోకి తీసుకొని పరిశీలిస్తున్నారు.

police complaint papers ironing in vardhannapeta
పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు
author img

By

Published : Aug 2, 2020, 9:44 AM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్​లలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా వర్ధన్నపేట పోలీసులు స్టేషన్‌కు వచ్చే దరఖాస్తులను స్టెరిలైట్ చేస్తున్నారు. ఇస్త్రీ పెట్టె సాయంతో దరఖాస్తు పేపర్లను రుద్దిన తర్వాతనే వాటిని పరిశీలిస్తున్నారు. వర్ధన్నపేట, రాయపర్తి, జఫర్​గడ్ పోలీసు స్టేషన్​లలో ఫిర్యాదులు స్టెరిలైజేషన్ చేసిన తర్వాతే స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే వర్ధన్నపేట పోలీస్ స్టేషన్​లో ఏడుగురు సిబ్బందికి కరోనా సోకింది. అందువల్లే ముందుస్తు చర్యల్లో భాగంగా ఇలా ఇస్త్రీ కంప్లైంట్స్ సేకరణకు శ్రీకారం చుట్టారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ పోలీస్ స్టేషన్​ వద్దకు రావద్దని తెలిపారు. సమూహాలుగా కాకుండా ఒక్కరు మాత్రమే ఫిర్యాదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.