ETV Bharat / state

పోలీసుల కస్టడీలో సైఫ్​.. హెచ్​వోడీ నాగార్జునరెడ్డిపై వేటు - hod transfer

Police are interrogating Saif: ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్​ విద్యార్థి సైఫ్​ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను వరంగల్​లోని మట్టేవాడ పోలీస్​ స్టేషన్​కు తరలించి అక్కడి పోలీసులు విచారిస్తున్నారు.

SAIF CUSTODY
SAIF CUSTODY
author img

By

Published : Mar 2, 2023, 3:07 PM IST

Updated : Mar 3, 2023, 6:37 AM IST

Police are interrogating Saif: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్​ ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్​ విద్యార్థి సైఫ్​ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ఆయనను పోలీసులు వరంగల్​ జిల్లాలోని మట్టేవాడ పోలీసు స్టేషన్​కు తరలించారు. అక్కడ పోలీసులు నాలుగు రోజుల పాటు విచారించి కీలక ఆధారాలు స్వీకరించనున్నారు. సైఫ్​పై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. సైఫ్ వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు, యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు ఇప్పటికే నిర్ధారించారు.

హెచ్​వోడీపై బదిలీ వేటు: మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య వ్యవహారంలో సైఫ్.. మానసిక వేధింపులు నిజమేనని ర్యాంగింగ్ నిరోధక కమిటీ నిర్ధారించింది. యూనివర్సిటీ గ్రాంట్స్​ కమిషన్​ ఆదేశాల మేరకు బుధవారం వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ తన నివేదిక సమర్పించింది. ఇందులో ఆస్పత్రిలో ప్రీవెంట్ అనస్థీషియా నివేదిక విషయంలో జరిగిన ఒక వివాదం ఒక్కటే వీరి మధ్య వివాదానికి కారణ కాదని తేల్చింది. అంతే కాకుండా వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన అనస్థీషియా వైద్య విభాగం హెచ్​వోడీ నాగార్జునరెడ్డి కూడా సైఫ్​ది తప్పేనని అంగీకరించాడు. దీని ఆధారంగా అనస్తీషియా విభాగాధిపతి నాగార్జునరెడ్డిపై ఇవాళ బదిలీ వేటు పడింది. ఆయనను భూపాలపల్లి వైద్య కళాశాల ప్రొఫెసర్​గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినా..: మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో హెచ్​వోడీ నాగార్జున రెడ్డి సరిగ్గా వ్యవహరించలేదని, నిర్లక్ష్యం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సైఫ్ వేధిస్తున్నాడన్న విషయాన్ని ప్రీతి.. నాగార్జునరెడ్డి దృష్టికి తీసుకువచ్చినా నిందితుడిని కేవలం మందలించి పంపించేయడం వివాదాస్పదమైంది. ప్రీతి ఫిర్యాదు చేసినప్పుడే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆమె చనిపోయేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ప్రీతి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, విపక్ష నేతలు, గిరిజన సంఘాల నాయకులు కూడా నాగార్డున రెడ్డిపై వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చదవండి:

'రిజర్వేషన్‌ బాపతు ఇలాగే ఉంటారు'.. ప్రీతిని అవమానించిన సైఫ్.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

నా కుమార్తెది ఆత్మహత్య కాదు.. హత్యే.. : ప్రీతి తండ్రి

'ఆ నలుగురిని వదలొద్దు..' సాత్విక్ సూసైడ్‌ నోట్​లో విస్తుపోయే విషయాలు

అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో మరో హత్య.. ప్రేమించిన అమ్మాయిపై మనసుపడ్డాడని..

Last Updated : Mar 3, 2023, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.