వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో 1, 2 ,18 వార్డుల్లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. తాము ఆరు వార్డులు పోటీ చేస్తున్నామని పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ నిర్బంధంలో కూడా తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పోటీ చేస్తున్నారని తెలిపారు. పురపాలికలో ప్రశ్నించే గొంతుగా నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏకగ్రీవాలతో పురపాలికలు దక్కించుకున్న తెరాస... ఆ పార్టీ చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు 18వ వార్డు కంచు కోట అని... మరోసారి ఇక్కడ కాంగ్రెస్ విజయం తథ్యమని అభ్యర్థి కొయ్యడా శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : చేతులెత్తే విధానంలో ఛైర్ పర్సన్ల ఎంపిక?