ఈ నెల 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా... వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్గా తేలింది. కరోనా నివారణకు పాటించాల్సిన నిబంధనలన్నీ పాటిస్తూనే ప్రజాసేవలో అంకితమైన తనకు నెగిటివ్ రిపోర్ట్ రావడం సంతోషంగా ఉందన్నారు.
కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్ వచ్చిన వారినే... సమావేశాల్లోకి అనుమతిస్తామన్న స్పీకర్ ఆదేశాలతో కొవిడ్ పరీక్ష చేయించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కరోనా సోకినంత మాత్రన ప్రజలు బయపడవద్దని... బాధితులను అంటరానివారిగా చూడొద్దని ఎమ్మెల్యే కోరారు. వైద్యులు సూచించిన నిబంధనలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చని సూచించారు.