వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మద్దతు ధరతో రైతుకు న్యాయం చేసింది కేసీఆర్ మాత్రమేనని, రైతుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం తెరాసనేనని ఎమ్మెల్యే అన్నారు. చివరి ధాన్యం గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు దిగులు పడవలసి పని లేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మహేందర్ రెడ్డి, ఆర్డీఓ మహేందర్, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై మరో 'పెట్రో' దాడి