ETV Bharat / state

పరకాలలో లాక్​డౌన్​ విధించమని భాజపా వినతి - వరంగల్​ న్యూస్​

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాలలో రెండు రోజుల పాటు లాక్​డౌన్​ విధించమని భాజపా నేతలు మున్సిపాలిటీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పరకాల పట్టణంలో రెండు కేసులు నమోదైన కారణంగా రెండు రోజుల పాటు లాక్​డౌన్​ విధించి కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Parakala BJP Letter To Municipality Health Officer For Two Days Lock Down
పరకాలలో లాక్​డౌన్​ విధించమని భాజపా వినతి
author img

By

Published : Jun 27, 2020, 10:35 AM IST

వరంగల్ రురల్ జిల్లా పరకాలలో రెండు రోజుల లాక్​డౌన్​ విధించమని పరకాల మున్సిపాలిటీ అధికారులకు బీజేపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. రోజురోజుకు జిల్లాల్లో పెరగడం, పట్టణంలో రెండు కేసులు నమోదు కావడం వంటి ఘటనలు దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు నిత్యావసరాలు తప్ప మిగదా దుకాణాలు పూర్తిగా లాక్​డౌన్​ చేయాలని కోరారు.

బస్టాండ్​, పోలీస్​స్టేషన్, ప్రభుత్వ దవాఖాన, కూరగాయల మార్కెట్​ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందిచే శానిటైజ్ చేయించాలన్నారు. రసాయనాల పిచికారీ చేయించి వైరస్​ వ్యాప్తిని నివారించాలని మున్సిపల్​ హెల్త్​ ఆఫీసర్​ మధుసూదన్​ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గండ్ర జైపాల్ రెడ్డి, బీజేపీ కౌన్సిలర్లు ఆర్పీ జయంత్ లాల్, దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్, కొలనుపాక భద్రయ్య పాల్గొన్నారు.

ఇవీచూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.