వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానం దినోత్సవం సందర్భంగా భాజపా నేతలు నివాళి అర్పించారు. ఆయన జ్ఞాపకార్థం పట్టణంలోని 52వ బూత్‌లో మొక్కలు నాటారు.
భారత దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జెండా, ఒకే ప్రధాని ఉండాలని.. కాంక్షించి.. కాశ్మీర్లో 370 అధికరణ రద్దు కోసం పోరాడి బలిదానమైన డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు ముఖ్య అతిథిగా హాజరైన భాజపా రాష్ట్ర నాయకులు దేవునూరి మేఘనాథ్. ఈ కార్యక్రమంలో 22 వ వార్డు కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య, పట్టణ ఉపాధ్యక్షులు నాగెల్లి రంజిత్, బూత్ నాయకులు ఎండి సిరాజ్, మేకల ప్రవీణ్, సిద్ధూ, మార్జొడు రంజిత్, యంజాల రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్