ETV Bharat / state

చెట్లను నాటి భవిష్యత్ తరాలకు బహుమతిగా ఇద్దాం: ఎర్రబెల్లి - ఎర్రబెల్లి దయాకర్​ రావు వార్తలు

చెట్లను నాటి భవిష్యత్ తరాలకు బహుమతిగా ఇద్దామని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలోని సంగెం మండలం తీగరాజుపల్లె, గుంటూరుపల్లెలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మొక్కలు నాటారు.

panchayathiraj minister errabelli dayakar rao
చెట్లను నాటి భవిష్యత్ తరాలకు బహుమతిగా ఇద్దాం: ఎర్రబెల్లి
author img

By

Published : Jun 28, 2020, 1:57 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లాలోని సంగెం మండలం తీగరాజుపల్లె, గుంటూరుపల్లెలో హరితహారంలో భాగంగా పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు మొక్కలు నాటారు. ఆకుపచ్చ తెలంగాణనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారానికి అంకురార్పణ చేశారని చెప్పారు.

ప్రజలు ప్రజా ప్రతినిధులు ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలన్నారు. రాబోయే తరాలకు ఆహ్లాదకరమైన వృక్ష సంపదను బహుమతిగా ఇవ్వాలన్నారు. మొక్కలు నాటితే సరిపోదని వాటి సంరక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.

చెట్లను నాటి భవిష్యత్ తరాలకు బహుమతిగా ఇద్దాం: ఎర్రబెల్లి

ఇదీ చూడండి: 'రామాయణం నుంచి మొదలు పెడితే 1991 దాకా ఒక్కరూ లేరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.