వరంగల్ గ్రామీణ జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు 30 అడుగుల చేరుకొని అలుగు పారుతోంది. కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో చెరువులు, వాగులు పొంగిపొర్లటం వల్ల పాకాలకు వరద వస్తోంది. ఇప్పటికే పాకాల మత్తడిని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తున్నారు. చెరువు నిండినందున తమకు రెండు పంటలు పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పాకాల నిండుకుండను తలపిస్తుండటం వల్ల... పర్యాటకులతో అభివృద్ధి చెందుతోందని వరంగల్ రూరల్ జిల్లా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. నర్సంపేట మండలం మాదన్నపేట చెరువు, వట్టి వాగు పొంగిపొర్లుతోంది.
ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్‌వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!