ETV Bharat / state

Farmers Problems in Hanamkonda : వర్షాకాలం వచ్చేస్తుంది.. త్వరగా ధాన్యం కొనండయ్యా..! - telangana farmers

Paddy procurement delay in Hanamkonda : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పట్లేదు. అకాల వర్షాలతో ఇప్పటికే ఆగమయిన కర్షకులకు.. కొనుగోలు కేంద్రాల వద్ద నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు లారీలు లభించడం లేదు. వర్షాకాలం సమీపించినా.. యాసంగి ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల వద్దే మగ్గిపోతోందని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో ఈఏడాది ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 3, 2023, 8:56 AM IST

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా

Paddy Farmers Problems in Hanamkonda : హనుమకొండ జిల్లా పరకాల డివిజన్‌లో పంట కొనుగోలు కేంద్రాల నుంచి వరి, మొక్కజొన్న ధాన్యం తరలింపు నిలిచిపోయింది. లారీల కొరత తీవ్రంగా ఉండడంతో పంటను ఎగుమతి చేసే మార్గం కనిపించక రైతులు నిస్సహాయంగా నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని పరకాల, శాయంపేట, దామెర మండలాలకు చెందిన అన్నదాతలు వారాల తరబడి లారీల కోసం ఎదురుచూస్తున్నారు. మార్కెటింగ్‌ అధికారులు, వాహనాల కాంట్రాక్టర్ల నిర్వహణ లోపంతో లారీలు సకాలంలో కొనుగోలు కేంద్రాలకు రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No facilities for Farmers in Paddy Purchase centers : ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లోనే తీవ్రస్థాయిలో పంట నష్టం జరిగిందని రైతులు చెప్పారు. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే, వాటిని తరలించేందుకు నెల రోజులుగా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాలపైన కప్పేందుకు టార్పాలిన్‌ కవర్లు ఇవ్వడం లేదని తెలిపారు. ఆకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలకు బస్తాల్లో నింపిన ధాన్యం తడిసి ముద్దవుతోంది.

"సింగారం గ్రామంలోని వ్యవసాయ మార్కెట్​ యార్డు దగ్గర ధాన్యం నిల్వ ఉండిపోయింది. ఇప్పటికే 45 రోజులు అవుతుంది. కేవలం 3 లారీలు మాత్రమే వెళ్లాయి. మరో నాలుగు లారీలు కాంటాలు అయ్యాయి. సుమారు 70 లారీల ధాన్యం ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. వర్షా కాలం వస్తున్నా.. యాసంగి పంట ఇప్పటికి కొనుగోలు చేయలేదు. మళ్లీ వర్షాలు వస్తే ఇప్పటికే తడిచి ఉన్న ధాన్యం మరింత పాడవుతుంది. దీంతో మొలకలు వచ్చే అవకాశం ఉంది. త్వరగా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాను."- స్థానిక రైతు

" నాది ఇక్కడ దాదాపు 70- 80 బస్తాల లోడు ఉంది. ఇప్పటి వరకు పట్టించుకున్న నాథుడు లేడు. సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే మాకు ఆత్మహత్య చేసుకోడం తప్ప మరో దారి కనిపించట్లేదు. సగం వడ్లు వర్షాలకు భూమిలోనే ఉండిపోయాయి. మిగిలిన సగం ఇక్కడ నీళ్ల పాలవుతున్నాయి. ధాన్యం అమ్మినా.. మా పెట్టుబడి డబ్బులు వస్తాయో రావో తెలియదు. కొనుగోలు ఆలస్యం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ప్రభుత్వం త్వరగా వరి బస్తాలు కొనుగోలు చేసి.. ఏర్పాటు చేయాలని కోరుతున్నాను."- స్థానిక రైతు

Shortage of Lorries at Purchase Centers in Telangana : సకాలంలో లారీలు సమకూర్చాలంటూ పరకాల వ్యవసాయ మార్కెట్‌ వద్ద, దామెర మండలం సింగరాజు పల్లి వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు పంపాలని రైతులు కోరుతున్నారు. ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.