ETV Bharat / state

PACS chairman Mohan reddy: పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి వీరంగం.. - తెలంగాణ వార్తలు

నర్సంపేట పట్టణంలో పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి(pacs chairman mohan reddy) వీరంగం చేశారు. తన కారును ఎందుకు ఫొటో తీశారంటూ కానిస్టేబుల్​ పట్ల దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో దుర్భాషలాడినట్లు పోలీసులు తెలిపారు.

PACS chairman Mohan reddy, fires on conistable
పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి వీరంగం, కానిస్టేబుల్​తో దుర్భాష
author img

By

Published : Nov 6, 2021, 6:01 PM IST

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి(pacs chairman mohan reddy) వీరంగం చేశారు. తన కారును ఫొటో తీస్తారా? అంటూ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో దుర్భాషలాడినట్లు పోలీసులు తెలిపారు.

నర్సంపేట పట్టణంలో పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్ రెడ్డి... సీటు బెల్ట్ పెట్టుకోకుండా కారు నడుపుతుండడంతో కానిస్టేబుల్ ఫోటో తీశారని పోలీసులు తెలిపారు. అది గమనించిన అధికార పార్టీ ఛైర్మన్... తానెవరో తెలియదా? కారును ఎందుకు ఫొటోలు తీశావంటూ? దురుసుగా మాట్లాడారని పేర్కొన్నారు. మోహన్​రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

పీఏసీఎస్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి వీరంగం

ఇదీ చదవండి: Students missing: బద్వేలులో విద్యార్థుల అదృశ్యం.. హైదరాబాద్​లో ప్రత్యక్ష్యం.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.