ETV Bharat / state

భూమి ఆక్రమణకు యత్నం.. అడ్డుకున్న మహిళా రైతుపై దాడి

author img

By

Published : May 15, 2021, 10:52 PM IST

ఇరవై ఏళ్ల క్రితం అమ్మిన భూమిని ఆక్రమించేందుకు ఓ మహిళా రైతు కుటుంబంపై విచక్షణ రహితంగా కర్రలతో దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

one person attack women farmer in land issue annaram village
మహిళా రైతుపై దాడి

రెండు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమి ఆక్రమణకు యత్నించాడు ఓ వ్యక్తి. అంతేకాకుండా ఓ మహిళా రైతు కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

అన్నారం గ్రామానికి చెందిన మహిళా రైతు సముద్రాల సునీత.. 13 ఏళ్ల క్రితం 7.5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఇన్నాళ్లు ఆ భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఆ భూమి తనదని 20 ఏళ్ల క్రితం అమ్మిన సముద్రాల సాంబయ్య అనే వ్యక్తి ఈ నెల 11వ తేదీన ట్రాక్టర్​తో ఆమె పొలాన్ని వచ్చి దున్నుతుండగా అక్కడే ఉన్న కుటుంబసభ్యులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే సాంబయ్య అనే వ్యక్తి పరుష పదజాలంతో వారిని తిడుతూ కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. ఈ దాడిని ప్రతిఘటించిన సునీత ఆమె భర్తతో కలిసి డయల్​ 100కు సమాచారం అందించారు. పర్వతగిరి పోలీసులు వచ్చి.. దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించి ఫిర్యాదు నమోదు చేసుకుని వెళ్లిపోయారు.

రాజకీయ నాయకుడి అండతో ఆక్రమణకు యత్నం

అయితే ఆ మహిళా రైతు ఈ భూమిని కొనుగోలు చేయకముందే ముగ్గురి చేతులు మారి చివరగా వీరు కొనుగోలు చేశారు. ఈ భూమి సముద్రాల అనే ఇంటిపేరు ఉండడం వల్ల అది కుడా సాంబయ్య అనే ఒకే పేరుతో ఉండడంతో స్థానిక ఓ రాజకీయ నాయకుడు అండతో ఆక్రమించేందుకు తమపై దాడి చేయించారని పట్టాదారులు ఆరోపించారు. భూమికి సంబంధించిన కొనుగోలు పత్రాలు, పట్టాదారు పాస్ బుక్, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు వంటి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. భూమిపై ఆధారపడి జీవించే తమ కుటుంబాన్ని కాపాడాలని మహిళా రైతు సునీత వేడుకొంటున్నారు. ఆ వ్యక్తితో తమకు ప్రాణభయం ఉందని జిల్లా కలెక్టర్, ఆర్డీవో న్యాయ విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

చర్యలు తీసుకోవాలి

ఇలా రైతులపై దాడికి పాల్పడి వ్యవసాయ భూములను కబ్జాలకు పాల్పడే వారిపై జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఉపసర్పంచ్ గొడుగు భిక్షపతి, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సకు నోడల్ కేంద్రంగా ఈఎన్‌టీ ఆస్పత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.