వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సోమవారం శాయంపేట తహసీల్దార్ కార్యాలయం భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. పెద్దకోడెపాక ఎస్బీఐ సర్వీస్ బ్యాంకు నిర్వాహకులు తమకు రూ. 20 వేలు మోసం చేశారంటూ వారు ఆరోపించారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఘటనపై విచారణ జరుపుతామని సముదాయించగా వృద్ధ దంపతులు కిందకి దిగివచ్చారు. అనంతరం తహసీల్దార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి : జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్.. రూ. 45 లక్షలు డిమాండ్!