రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలో విద్యార్థులచే ర్యాలీ చేశారు. వరంగల్ రోడ్ కూడలి నుంచి అమరవీరుల స్థూపంవరకు ర్యాలీ కొనసాగించారు. మార్గమధ్యలో హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి గులాబీలు అందించి అభినందించారు.
వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని రవాణ శాఖ అధికారులు అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది యువకులే మృత్యువాత పడుతున్నారని వెల్లడించారు.
ఇదీ చూడండి : బ్యాంకు నుంచి నగదు, నగలు మాయం!