వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం రావులతండాలోని అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లను గర్భిణులకు పంపిణీ చేశారు. ఇదేంటని అంగన్వాడీ కార్యకర్తలను నిలదీయగా.. పై నుంచి ఇలానే వస్తున్నాయని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని మహిళలు వాపోయారు.
పప్పు, బియ్యం, పాలు వంటనూనెలోనూ చేతివాటం చూపిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ప్రభుత్వం అందిస్తోన్న పౌష్టికాహారం తమకు అందడం లేదని గర్భిణులు, బాలింతలు చెబుతున్నారు. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.