కంటి మీద కనుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు.. అంతా అహర్నిశలూ శ్రమిస్తున్నా కేసులు సంఖ్య తగ్గట్లేదు. రోజు రోజుకూ పాజిటవ్ కేసులు పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వరంగల్ జిల్లాలో మాత్రం ఈనెల ప్రారంభం వరకూ మొదటి వారం వరకూ కేసులు రాలేదు. మర్కజ్ వెళ్లి వచ్చినవారితో అర్బన్ జిల్లాలో ఒక్కసారిగా కేసులు పెరిగాయ్. మొత్తం 25 పాజిటవ్ కేసులు నమోదైయ్యాయి.
మర్కజ్ వెళ్లి వచ్చిన వారు తక్కువ..
ములుగు జిల్లాలో రెండు, భూపాలపల్లిలో మూడు, జనగామలో రెండు, మహబూబాబాద్‌లో ఒకటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో మాత్రం ఒక్క కేసూ నమోదు కాలేదు. జిల్లాలో వైరస్ ప్రబలకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విదేశాలనుంచి వచ్చిన వారినీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని కట్టడి చేసి హోం క్వారెంటైన్ చేశారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు తక్కువగా కూడా ఉండడం పాజిటివ్ కేసులు పెరగకపోవడానికి దోహదం చేసిందని వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత అంటున్నారు.
కరోనా కేసులు లేకున్నా పూర్తిగా అప్రమత్తంగానే ఉంటున్నారు జిల్లా అధికారులు. కొత్తవారెవరు వచ్చినా తమకు సమాచారం ఇచ్చేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఏమాత్రం వైరస్ లక్షణాలు కనపడినా...వెంటనే ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు