వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో కరోనా కలవరం మొదలైంది. లాక్డౌన్ విధించినప్పటి నుంచి 95 రోజుల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని పరకాల పట్టణంలో నాలుగు రోజుల క్రితం నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23 మందికి చేసిన కరోనా పరీక్షల్లో ఓ పోలీసు అధికారికి, కానిస్టేబుల్కు పాజిటివ్ వచ్చింది. మిగతా ఇద్దరిలో.. ఒకరు డ్రైవర్ కాగా.. మరొకరు వడ్రంగి పని చేసే వ్యక్తిగా అధికారులు ధృవీకరించారు.
ఈ నలుగురికి సంబంధించిన వ్యక్తులను ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించి హోం క్వారంటైన్ చేశారు. డ్రైవర్గా పనిచేసే వ్యక్తి.. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి భార్యకు తన వాహనాన్ని అద్దెకు నడుపుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన వైద్యారోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా