ETV Bharat / state

ఒకేరోజు వందమందితో పని... స్వచ్ఛ గ్రామంగా నల్లబెల్లి - village clean program at nallabelli

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ అధికారులు మల్టీ వర్కర్స్​తో పారిశుద్ధ్య పనులను నిర్వహించి గ్రామమంతా శుభ్రం చేశారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్యకర్తలు పాల్గొనగా వారికి పనుల్లో అధికారులు శిక్షణ ఇచ్చారు.

ఒకేరోజు వందిమంది పని... స్వచ్ఛ గ్రామంగా మారిన నల్లబెల్లి

author img

By

Published : Mar 4, 2021, 5:31 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాలలో 86 మంది మల్టీవర్కర్లు పనిచేస్తున్నారు. వారితో పాటు 29 మంది పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. గ్రామాల్లో అన్ని పనులను మల్టీవర్కర్లు చేస్తుండడం వల్ల పనులపై పూర్తిగా పట్టురాలేదు. కార్మికులందరినీ ఒకే గ్రామానికి చేర్చి వీధులను శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లుపట్టడం, ముళ్ల పొదలను తొలగించడం లాంటి పనులను మూకుమ్మడిగా చేయడం వల్ల గ్రామమంతా శుభ్రంగా మారింది.

వేతనం పెంచండి...

పారిశుద్ధ్య కార్మికులు పనులు చేయగా పంచాయతీ కార్యదర్శులు దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ దయచూసి రూ. 15 వేలకు తమ వేతనాలు పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు. పనిభారం కూడా పెరిగిందని.. గ్రామంలోని అన్నిపనులను చేస్తున్నామని వారు తెలిపారు.

అన్ని గ్రామాల్లోనూ...

ఒకేరోజు దాదాపు 100 మంది సిబ్బందితో తమ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దారని నల్లబెల్లి సర్పంచ్ రాజారాం అన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్ని గ్రామాల్లోనూ కార్మికులు ఇదే విధంగా పనులు చేయాలని సూచించామని మండల పంచాయతీ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: ఒకప్పుడు పిచ్చోడు... ఇప్పుడు మంచోడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.