వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని తహరపూర్, శాయంపేట, ప్రగతి సింగారం, నేరేడుపల్లి, కాట్రపల్లి, కొప్పుల, జోగంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందించనప్పటికీ సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే అన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ధాన్యంలో రాళ్లు, మట్టి, తాలు, తేమ లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులను ధరించాలని విజ్ఞప్తి చేశారు.
111 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వారి స్వగ్రామంలోనే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్లు, పీఏసీఎస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నేతల పరస్పర విమర్శలు... బయటపడుతున్న తెరాస రహస్యాలు..!