వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శాయంపేట మండలంలో పలు గ్రామాల్లో నష్టపోయిన పంటలు, రోడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. మండలంలోని పత్తిపాక, మైలారం, పెద్దకొడెపాక గ్రామాల్లో నష్టపోయిన పంట భూములను పరిశీలించి.. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను ఇవ్వమని అధికారులను ఆదేశించారు.
మండలంలో ఎక్కడెక్కడ రోడ్లు పాడైపోయాయో రిపోర్టు ఇవ్వాలని ఏఈకి తెలిపారు. వాటితో పాటు ఎన్ని గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు అవసరమో తక్షణమే వాటిని సమకూర్చాలని ఎమ్మెల్యే ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. అనంతరం జోగంపల్లిలో 104 ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు.
ఇదీ చదవండిః భాగ్యనగర యువకుడు.. శకుంతలా దేవిని మించిన గణిత మేధావి