వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. కల్యాణ లక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. సంగం మండలంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 42 లక్షలు 29 వేల 988 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పేదింటి బిడ్డకు వరప్రదాయినని పేర్కొన్నారు. నాగారం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. మహిళా సోదరీమణులకు ఒక అన్నగా చీరని పంచే అవకాశం తనకు రావడం ఎంతో ఆనందదాయకమని వెల్లడించారు.
ఇవీ చూడండి: నామినేషన్లకు నేడే చివరి తేదీ