వరంగల్ రూరల్ జిల్లా గుడిపహడ్ చెక్‌పోస్టు వద్ద ఆత్మకూరు, దామెర మండలాల రైతులు లారీల కోసం పడిగాపులు పడడం చూసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాహనం ఆపి వారితో మాట్లాడారు. పండించిన ధాన్యాన్ని గోదాములకు తరలించడానికి లారీల కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు సహకరించాలని ఆయన లారీల యజమానులతో మాట్లాడారు. ధాన్యం తరలించడానికి లారీలు సమకూరిస్తే.. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఇసుక క్వారీల వద్దకు వెళ్లడానికి ప్రత్యేక పాసులు జారీ చేయిస్తామని అన్నారు.
రైతులకు సహకరిస్తే లారీలకు ప్రత్యేక పాసులు: ధర్మారెడ్డి - పరకాల
రైతులు పండించిన ధాన్యం గోదాములకు తరలించడానికి ప్రైవేటు వాహనాల యజమానులు సహకరించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గుడిపహడ్ చెక్‌పోస్టు వద్ద ధాన్యం తరలించడానికి లారీల కోసం వచ్చిన రైతులను చూసి ఆయన వాహనం ఆపి వారితో మాట్లాడారు.
రైతుల సమస్య తీర్చేందుకు వాహన యజమానులతో మాట్లాడిన ఎమ్మెల్యే
వరంగల్ రూరల్ జిల్లా గుడిపహడ్ చెక్‌పోస్టు వద్ద ఆత్మకూరు, దామెర మండలాల రైతులు లారీల కోసం పడిగాపులు పడడం చూసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాహనం ఆపి వారితో మాట్లాడారు. పండించిన ధాన్యాన్ని గోదాములకు తరలించడానికి లారీల కోసం ఇబ్బంది పడుతున్న రైతులకు సహకరించాలని ఆయన లారీల యజమానులతో మాట్లాడారు. ధాన్యం తరలించడానికి లారీలు సమకూరిస్తే.. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఇసుక క్వారీల వద్దకు వెళ్లడానికి ప్రత్యేక పాసులు జారీ చేయిస్తామని అన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు