వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పోచారం గ్రామస్థులతో సమావేశమయ్యారు. గ్రామంలో ఉన్న సమస్యలు, పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమంలో భాగంగా పెంచుతున్న చెట్ల బాగోగుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వివరించారు. అందుకే గ్రామాభివృద్ధికి గ్రామంలోని ప్రతీ ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు