వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికలను కార్యకర్తలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులను ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చొరవతో అధిక నిధులు మంజూరు చేసుకొని పరకాల పట్టణంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.
ఇదీ చదవండిః సుబ్రహ్మణ్య స్వామికి గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు