కర్పూరం, పసుపు వంటి చిట్కాలతో వైరస్లను అరికట్టవచ్చని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల వ్యాపారులకు కరోనాపై అవగాహన కల్పించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా కట్టడి చర్యలపై ఆరా తీశారు. వైద్య సదుపాయాలను పరిశీలించారు.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని.. అధికారులు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్ నిర్మూలనకై అగ్నిమాపక కేంద్రం సిబ్బందితో రోడ్లపై రసాయనాలు పిచికారి చేయించారు.