కుటుంబసభ్యులతో కలిసి పంట పొలాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విహరించారు. వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని తన నివాసంలో మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి స్వయంగా తన పాతకాలం జీపుని నడుపుతూ, వెనుక ట్రాలీని అమర్చి కుటుంబ సభ్యులను అందులో కూర్చోబెట్టి ఊరంతా తిప్పి చూపించారు.
వారితో పూర్వపు రోజులను నెమరువేసుకుంటూ గ్రామస్థులతో మాటామంతి జరిపిన జరిపారు. ఎన్ని కోట్లు సంపాదించినా... ఎన్ని దేశాలు తిరిగిన ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని.. ఎన్ని కష్టాలు వచ్చిన మరవొద్దని ఆయన మనవడు, మవరాళ్లతో చెప్పారు. తన మనసులోని మాటలను మనోభావాలను వారితో పంచుకున్నారు.
ఇవీ చూడండి: కరోనా కన్నీళ్లు: చనిపోయిన ఆరురోజుల తర్వాత అంత్యక్రియలు