ETV Bharat / state

'కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచండి' - వైద్యులతో అత్యవసర సమావేశం

కరోనాపై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. వరంగల్​లోని ఎంజీఎం ఆసుపత్రిలోని సిబ్బంది, జిల్లా పాలకవర్గంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

minister yerrabelli emergency meeting on corona virus in warangal
'కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచండి'
author img

By

Published : Mar 4, 2020, 8:09 PM IST

కరోనా వైరస్​పై ప్రజల్లో అవగాహన కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ కేసు నమోదు కావడం వల్ల వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలోని వైద్యులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

అంతకు ముందుగా నూతనంగా 25 పడకలతో ఏర్పాటు చేసిన వార్డును ఆయన సందర్శించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలతో పాటు ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛ ఆటోలలో ప్రచారం చేయాలని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్​కు సూచించారు.

ఆసుపత్రిలోని పరిసరాలు శుభ్రంగా లేకపోవడం చూసి అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వ్యాధి లక్షణాలతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేయడం, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

'కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచండి'

ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.