వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలోని కొనారెడ్డి చెరువు గండి వరద నీరు వరంగల్ - ఖమ్మం రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో ప్రయాణికులతో ఉన్న 7 వాహనాలు ఆ వరదలో చిక్కుకుపోయాయి. సుమారు 5 గంటల పాటు ప్రయాణికులు అక్కడే నిలిచిపోయారు.
![Minister Phone Call Saved 80 Members From Heavy Flood At Wardhannapet Warangal Rural District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8500453_166_8500453_1597988674802.png)
స్పందించిన మంత్రి ఎర్రబెల్లి
ప్రమాదాన్ని గ్రహించిన వారిలో కొందరు నేరుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే స్పందించిన మంత్రి వర్ధన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు 80 మంది ప్రయాణికులను రక్షించారు.
ఫోన్ కాల్కు స్పందించిన మంత్రికి, ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులకు చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు ప్రయాణికులు. సకాలంలో స్పందించిన పోలీసులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.
ఇదీ చదవండి- రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా