ETV Bharat / state

Harish rao Warangal Tour : 'ఒకవైపు విద్య, వైద్యం.. మరోవైపు ఉపాధి'

Harish rao Warangal Tour : ఈ ఏడాది చివరిలోగా వరంగల్ జిల్లా ప్రజలకు హెల్త్ సిటీ అందుబాటులోకి వచ్చి కార్పొరేట్ వైద్యం అందుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులకు అధిక సంఖ్యలో వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని వరంగల్ వైద్యకళాశాల ప్రారంభోత్సవంలో ఆయన చెప్పారు.

Minister Harishrao Inaugurates Medical College in Hanmakonda
'ఒకవైపు విద్య, వైద్యం.. మరోవైపు ఉపాధి'
author img

By

Published : May 31, 2023, 7:26 PM IST

Updated : May 31, 2023, 10:28 PM IST

Minister Harishrao Inaugurates Medical College in Hanmakonda : కేసీఆర్‌ పాలనలో వైద్యారోగ్యరంగంలో ఒక విప్లవం వచ్చిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హనుమకొండలోని హంటర్‌రోడ్డులో ఫాదర్ కొలంబో వైద్య కళాశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి హరీశ్‌ ప్రారంభించారు. అలాగే హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్ ప్రారంభించారు. దీంతో పాటు కేఎంసీలో అకాడమిక్ బ్లాక్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

Harish on Health City : 60 ఏళ్లలో 3 ప్రభుత్వ కాలేజీలు ఉంటే, 9 ఏళ్లలో 21కి చేరాయని చెప్పుకొచ్చారు. గతంలో ప్రభుత్వ, ప్రైవేటులో 20 వైద్య కళాశాలలు ఉంటే.. నేడు ఆ వైద్య కళాశాలల సంఖ్య 55కు చేరాయని చెప్పుకొచ్చారు. అలాగే ఎంబీబీఎస్ సీట్లు 2,950 నుంచి 8,340కి పెరిగాయని తెలిపారు. వైద్యాన్ని, విద్యను అందుబాటులోకి తేవాలని పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు తెలంగాణలో పెట్టుకోవడం జరిగింది. అంటే ఇవాళ విద్యార్థులకు మూడింతలు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ రాకుంటే ఇన్ని కాలేజీలు మనకు వచ్చేవా? కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఇన్ని సీట్లు మన పిల్లలకు దక్కేవా అని మీరందరు ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.

'ఒకవైపు విద్య, వైద్యం.. మరోవైపు ఉపాధి'

"ఇవాళ వైద్య, ఆరోగ్య రంగంలో ఒక విప్లవం వచ్చింది తెలంగాణ వచ్చాక. అరవై ఏళ్లలో తెలంగాణలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే ఇవాళ కేసీఆర్ హయాంలో 21 ప్రభుత్వ కళాశాలలొచ్చాయి. 1100 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణకు అద్భుతమైన సేవలందించే హెల్త్ సిటీ పనులు ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి కార్పొరేట్ వైద్యాన్ని వరంగల్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి తేబోతున్నాం."-హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి

వేగంగా సాగుతున్న హెల్త్ సిటీ నిర్మాణం : వరంగల్ 3 మెడికల్ కాలేజీలు ఉన్న నగరం అయ్యిందని.. రూ.1100 కోట్లతో హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతోందని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. ఉత్తర తెలంగాణకు వైద్య సేవలు అందించేందుకు హెల్త్ సిటీ నిర్మాణం వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పనే లక్ష్యంగా కేసీఆర్‌ సర్కార్‌ ముందుకు సాగుతోందని హరీశ్‌రావు తెలిపారు.

విద్య, వైద్యం, ఉపాధి : ఒకవైపు వైద్యం, ఒకవైపు విద్య, మరోవైపు ఉపాధి ఈ మూడింటితో ఈ జిల్లా అన్నింట్లో ముందంజలో ఉంటుంది. ఈ మూడు అవకాశాలు మెడికల్ కాలేజీ ద్వారా ఈ ప్రాంతానికి అందుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. దీనివల్ల ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి అనేది జరుగుతుందని.. ఎంతో ఆక్టివిటీ ఈ ప్రాంతంలో జరుగుతుందని ఆయన తెలిపారు. ఏడాది చివరిలోగా వరంగల్ హెల్త్ సిటీ పనులు అత్యంత వేగంగా పూర్తి చేసి.. మంచి కార్పొరేట్ వైద్యాన్ని వరంగల్ జిల్లా ప్రజలకు అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : May 31, 2023, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.