ETV Bharat / state

రైతులను నట్టేటా ముంచే చట్టాన్ని వాపస్ తీసుకోవాలి: ఈటల - వ్యవసాయ చట్టంపై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో రైతులు తలపెట్టిన భారత్‌ బంద్​లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. రైతులు, కార్యకర్తలతో కలిసి మంత్రి బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రైతులను నట్టేటా ముంచే చట్టాన్ని వాపస్ తీసుకోవాలి: ఈటల

author img

By

Published : Dec 8, 2020, 5:49 PM IST

రైతులను, వ్యవసాయాన్ని నట్టేటా ముంచే నల్ల వ్యవసాయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వాపస్‌ తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో రైతులు తలపెట్టిన భారత్‌ బంద్​లో ఆయన పాల్గొన్నారు. రైతులు, కార్యకర్తలతో కలిసి మంత్రి బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భారత్... భూమిని, వ్యవసాయాన్ని నమ్ముకున్న దేశమని మంత్రి అన్నారు. ఎముకలు కొరికే చలిలో రైతులు వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే ప్రయత్నం నిలిపివేయాలన్నారు. ఈ చట్టంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు.

ఇదీ చూడండి: భారత్​ బంద్​ ప్రశాంతం... అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.