వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి తన నివాసంలో జయశంకర్ జన్నదినం సందర్భంగా ఆయన చిత్రపాఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంత కర్తగా తెలంగాణ ప్రజల గుండెల్లో వేసిన చెరగని ముద్ర వేశారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసిన సూచనలు, సలహాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా నిలిచాయని మంత్రి అన్నారు.
జయశంకర్ సార్ ఆజన్మాంతం బ్రహ్మచారిగా, తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారని కొనియాడారు. సార్ ఆశయాలనే ఆదేశిక సూత్రాలుగా, సీఎం కేసీఆర్ రాష్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : తండ్రికి తిండి పెట్టని తనయులు.. అరెస్ట్ చేసిన పోలీసులు..