ఎంసీపీఐ(యు) ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి గౌస్ పార్థివ దేహానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ గ్రామీణ జిల్లా కొత్తూరులోని కామ్రేడ్ గౌస్ నివాసానికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రభుత్వం గౌస్ కుటుంబానికి అండగా ఉంటుందని.. ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మారుమూల పల్లె నుంచి జాతీయ స్థాయిలో ఎంసీపీఐ(యు) పార్టీకి ఎనలేని సేవలు చేసి జాతీయ స్థాయి గుర్తింపు పొందారని కొనియాడారు. కామ్రేడ్ ఎండీ గౌస్‌కు జోహార్లు అంటూ మంత్రి ఎర్రబెల్లి నినదించారు.
- ఇదీ చదవండి : పడక లభించక కారులోనే కరోనా రోగి మృతి